నిర్మలమైన మనసు నీదని నాకు తెలుసు నిష్కల్మషమైన మనసు నీదని ఎవరికి తెలుసు బుర్రిపిట్టలా ప్రకృతి ఒడిలో ఆటలాడుతుంటావు లేడి కూనలా అమాయకంగా గంతులేస్తుంటావు స్వచ్ఛమైన నీప్రేమ దొరకడం కష్టమేమాకు ముత్యమంటి నీ నవ్వు మాకు చిక్కదే పాపం
ఏ ఓనమాలు నేర్చినావో రమ్యమైన రాగమాలిక భవ సాగరం లాంటి నిను వర్ణించడం అంతతేలిక(2) కలువ కాటుక కళ్ళు నీవి సిరుల విరుల కురులు నీవి ఏ శిల్పి చెక్కని చక్కనైన చెక్కిళ్ళు నీవి ఏ బాపు గీయని సుందరమైన రూపు నీది మృదుస్వభావ భరితమైన మును వ్రేళ్ళు నీకె సొంతం ఆనందపు హరివిల్లు వలె ఉన్నవి వంపులు సైతం
తొలిపొద్దు సింధూరపు దేవకాంతమా నిను చూసి తరించిపోతుంది నీలిమేఘము సాయంత్రపు స్నానమాడే స్వాతి ముత్యమా నిను చూసి చిన్నబోతుంది హిమ శికరము ఆ ఆనందం క్షణికమే అయినా నీ సంతోషము చిరఃకాలము
©suribabu.k
S