S

మోహిని నీకోసం ఈ అన్నయ్య రాసిన ఓ చిన్నగీతం

నా చిన్ని బంగారు తల్లి నా చిన్ని రతనాల వల్లి ఎవరమ్మా నువ్వూ........ నింగి సిగలో జాబిలి లానే నవ్వుతున్నావు ఎవరమ్మా నువ్వూ........ పూల తోటలో తెమ్మెర లానే తిరుగుతున్నావు
నీ చిన్ని పాదం చూస్తేనే మాకు పుణ్యం నీ చిన్ని చేయి తాకిన వాళ్ళ జన్మ ధన్యం ఇలపైకి ఈ దేవకన్యని పంపింది ఎవరో ఇలలో ఏ ఇంటిలో ఈరాణి నాట్యమాడుతుందో ఓ బుల్లి తల్లి నువు మా చిట్టి తల్లి నిను కన్న తల్లి నిజంగా సిరి కల్పవల్లి
ఓ పాలవెల్లి నీ నవ్వులన్నీ ఓ నాగమల్లి ఓబుజ్జి తల్లి నీకు తోడుండదా ఆ జాబెల్లి
అల్లి బిల్లి ఆటలాడుతావు ముద్దు ముద్దు మాటలాడుతావు చిట్టి పొట్టి అడుగులేస్తావు సిరి మువ్వకట్టి గంతులేస్తావు నిన్ను చూసి పుడమి తల్లి పులకించి పోతుంది నిన్ను తలచి ఆకాశగంగ గలగల నవ్వుతుంటుంది ఓ వెన్నెలమ్మా ఓ తేనె కొమ్మా ఓ బాపు బొమ్మ ఓ పూల రెమ్మా నిను కన్న మీ నాన్న బంగారమమ్మా...
నీ లాంటి చిట్టి పొట్టి బాలలందరికీ ఈ పాట అంకితం

మీ "మాతృశ్రీకళ్యాణి"
©suribabu.k