S

ఓ అందమైన అమ్మాయి

అమ్మని నాన్నని దైవంలా ఆరాధించే అమ్మాయి అందరినీ ప్రేమగా పలుకరించే అమ్మాయి ఆనందాలను దోసిట పట్టి ఆడుకునే అమ్మాయి మంచి మనసున్న అందమైన అమ్మాయి బంధాలను బంధుత్వాలను ఆదరించే అమ్మాయి తమ బాద్యతను చక్కగా నిర్వర్తించే అమ్మాయి మర్యాదగా నడుచుకునే మమత గల అమ్మాయి ప్రియమారా ప్రేమగా పలుకరించే అమ్మాయి నిజంగా నిష్కల్మషంగా నవ్వే అమ్మాయి ముద్దు ముద్దుగా మాట్లాడే మంచి అమ్మాయి ప్రతిక్షణం చూడాలనిపించేప్రతిరూపం అమ్మాయి సంతోషాలను పంచుకునే పసిపాప అమ్మాయి కలల్ని కథల్ని అంతరంగంలో దాచుకునే అవని అమ్మాయి ప్రతిఒక్కరినీ గౌరవించే పెద్దమనిషి అమ్మాయి నిర్మలంగా వికసించే పారిజాతం అమ్మాయి మధురమైన భావాలు పలికించే సంగీతం అమ్మాయి పువ్వులా వెల్లువిరిసే నవ్వు అమ్మాయి అంతలా పరవశించి పరిమళించే అమ్మాయి ఎవరో కాదు మన తెలుగింటి అమ్మాయి
©suribabu.k