నా చిన్ని బంగారు తల్లి
నా చిన్ని రతనాల వల్లి
ఎవరమ్మా నువ్వూ.....!
నింగి సిగలో జాబిలి లానే నవ్వుతున్నావు!!
ఎవరమ్మా నువ్వూ.....!
పూల తోటలో తెమ్మెరలానే తిరుగుతున్నావు!!
నీ చిన్ని పాదం చూస్తేనే పుణ్యం..
నీ చిన్ని చేయి తానిన జన్మ ధన్యం..(2)
ఇలపైకి ఈ దేవ కన్యని పంపింది ఎవరో!
ఇలలో ఏ ఇంటిలో ఈ మహరాణిని కన్నాది ఎవరో!!
ఓ బుల్లి తల్లి మా బుజ్జి తల్లి
నిను గన్న నీ తల్లి నిజంగా సిరి కల్పవల్లి...
ఓ పాలవెల్లి నీ నవ్వులన్నీ!
ఓ నాగమల్లి నీ నగవులన్నీ!!
నిను చూసి పుడమి తల్లి పులకించి పోతుందే చెల్లి!
నిను తలచి ఆకాశగంగ ఇల జారుతుందే తల్లి!!
అల్లి బిల్లి ఆటలాడే ముద్దు ముద్దు మాటలాడే(2)
చిన్ని చిన్ని అడుగులేసే చిట్టి పొట్టి పదముపాడే(2)
ఓవెన్నెలమ్మా !ఓ తేనే కొమ్మా!!
ఓ బాపు బొమ్మా! ఓ పూల రెమ్మా!!
నిను గన్న మీ నాన్న ఓ దేవుడమ్మా.......!!!
©suribabu.k
S