S

వదిలి వెళ్ళిన నీడ

మా దేవుడు మమ్మల్ని వదిలి వెళ్ళి పోయాడు
మా వైద్యుడు మమ్మల్ని విడిచి వెళ్ళి పోయాడు
మా అంతరాత్మలా ఉన్న మీరు
అసలు ఇప్పుడు ఏమైపోయారు
మా నీడ మాదిరి అనుకున్న మీరు
అసలిప్పుడెందుకు దూరం అయ్యారు
బలహీనులైన మమ్మల్ని వదిలి బలవంతులైన మీరు కాలగర్భంలో కలిసిపోయారా..!
అనాధులుగా మమ్మల్ని విడిచి
చిట్ట చివరికి కన్నీరు మిగిల్చి వదిలి వెళ్ళిపోయారా..!
నా వరకూ "నా ఆయువు మిగిలింది
నాకు ఆనందం కలిగింది" మీ వల్లె కదండీ!
మా వంటి ఎన్నో కుటుంబాలకు
భాధల్ని తీర్చారు ధైర్యాన్ని ఆపాదించారు కదండీ!
ఇప్పుడెందుకు దూరం అయ్యారూ.....
డాక్టరు గారూ ......
ఏ ఆపద మమ్మల్ని చుట్టి ముట్టిన
ఏ అనారోగ్యం మాకు సంభవించిన(2)
నేనున్నా లెమ్మంటూ మీకేమి కాదంటూ
అని ధైర్యం చెప్పే!!! చేతులు ఏమైపోయాయి...
మా తలిదండ్రులకూ,,మా అన్నదమ్ములకు..
మా బంధుమిత్రులకూ,,మా లాంటి ఎందరికో...
వైద్యం చేసిన మీరు "లేరు" అంటే
మా కొండంత ఆశ "కొరివి" పాలు అయ్యిందంటే
నమ్మలేక పోతున్నాం స్వామి మేము(2)
కుల మత భేధం లేకుండా
పేద ధనిక అంటూ చూడకుండా
చిరునవ్వులు చిందిస్తూ ధైర్యం ఆపాదిస్తూ
మీ కేమి కాదంటూ నేనున్నా లేమ్మంటూ
వైద్యం చేసినమీరు ఏమైపోయారు సారూ...!!!
ఇన్నాళ్ళూ మా కోసం శ్రమించారు మీరు
కానరాని లోకాలకి తరలివెళ్ళి పోయారు
తెల్లారి లేచి చూచె సరికి అస్తమించారు
చివరాకరికి
ఇకనైనా సుఖపడండి స్వర్గంలో మీరు
అల్లాహ్ దగ్గరకు వెళ్ళిపోయారా
డా. హుస్సేన్ గారు..
(నాకు భయం కలిగితే,బాధ కలిగితే,సంతోషం కలిగితే ఎవరికి చెప్పుకోను ? మీరు లేరు అన్న విషయాన్ని ఎలా జీర్ణించుకోను? కన్నీటితో వ్రాసాను ఈ కవితను నేను.మీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, మీ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను)
ప్రేమతో
మీ
సూరిబాబు .కె




©suribabu.k